High school | పారిశుద్ధ్య పనుల పరిశీలన…

High school | పారిశుద్ధ్య పనుల పరిశీలన…

High school | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని అంకిరెడ్డిగూడెం గ్రామంలో గ్రామ నూతన సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో పాలకవర్గం సభ్యులు పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా గ్రామంలోని వీధులను, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల(high school)లను తిరిగి పరిశీలించారు.

పారిశుద్ధ్యం కోసం ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులను, విద్యార్థులను అక్కడున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నర్సరీని సందర్శించి, పారిశుద్ధ్య(sanitation) వారోత్సవాల్లో భాగంగా వీధుల్లోని రోడ్లను గ్రామపంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వలందాస్ మహేష్ గౌడ్, వార్డు సభ్యులు బత్తుల అనూష మహేష్ గౌడ్, పాలెం వెంకటేశం, ముద్దం లింగస్వామి గౌడ్, దొడ్ల అండాలు శెట్టియ్య గౌడ్, దండుగల వెంకటేశం, బొమ్మని శ్రావణి స్వామి గౌడ్, రాపోలు రేణుక మల్లేష్, పంచాయతీ కార్యదర్శి పాండు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply