ప్రజా సమస్యలపై పోరాటం

ప్రజా సమస్యలపై పోరాటం

యాదాద్రి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : ఎన్ని అక్ర‌మ కేసులు బ‌నాయించినా భ‌య‌ప‌డేదిలేద‌ని, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తామ‌ని బీజేపీ(BJP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్(Vemula Ashok) అన్నారు. ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. జిల్లా కలెక్టరెట్ కార్యాలంలో రివ్యూ సమావేశానికి వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)ని కలసి సమస్యలపై వినతి పత్రం ఇవ్వడానికి వస్తే మంత్రి మౌఖిక ఆదేశాలతో పోలీసులు అరెస్టు చేయడం సిగ్గు చేటన్నారు.

మూడు గంటల పాటు కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్(Police Station)లో ఉంచడం పై అగ్రహం వ్యక్తం చేశారు. బస్వాపూర్ ప్రాజెక్టు లో బీఎన్ తిమ్మాపూర్ భూ నిర్వాసితులకు నష్ట పరిహారం అదించాలన్నారు. మదర్ డెయిరీ కి ప్రభుత్వం గ్రాంట్ విడుదల చేసి ఆదుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్(Ootkuri Ashok Goud), కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి, చందా మహేందర్ గుప్తా, అచ్చయ్య, బలరాం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply