Kompally village | కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు

Kompally village | కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు

Kompally village | మునుగోడు, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని కొంపల్లి గ్రామం తూర్పు గూడెం 9, 10 వార్డుల్లో విద్యుత్ సమస్యలున్నట్లు ఆ కాలనీ వాసులు గత మూడు రోజుల క్రితం ఉపసర్పంచ్ వెదిరె విజేందర్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లి తెలుపగా.. వారు తక్షణమే స్పందించారు. ఈరోజు విద్యుత్ స్తంభాలను సర్పంచ్ జీడిమడ్ల నిర్మల దశరథ సమక్షంలో ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించారు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడంతో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్య పరిష్కారం కావడంతో తూర్పు గూడెం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply