ప్రజల అవసరాల వ్యాపారం.. అభివృద్ధికి నాంది…

ప్రజల అవసరాల వ్యాపారం.. అభివృద్ధికి నాంది…

– ఫ్లెక్సీ ప్రింటింగ్, ల్యాబ్ ప్రారంభోత్సవంలో చిట్యాల సర్పంచి తౌటం లక్ష్మి..

చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రజలకు అవసరమైన వ్యాపారాలు పట్టణ లో, ఉన్న వాటిని గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం, గ్రామాల, మండల లాభివృద్ధికి నాంది, అని చిట్యాల గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మీ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో తిరుమల ఫ్లెక్సీ, ప్రింటింగ్, మల్టీ కలర్ ల్యాబ్ ను సర్పంచ్ లక్ష్మి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన వ్యాపారం చేయడంతో, వారి అభివృద్ధి తో పాటు ప్రజలకు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్, వార్డ్ మెంబర్ తవుటం నవీన్, యజమాని మాచర్ల సంజీవ్, కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, పాల్గొన్నారు.