ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం: ఎంఈఓ గురువారావు

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం: ఎంఈఓ గురువారావు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చౌటుప్పల్ మండల విద్యాధికారి గురువారావు పిలుపునిచ్చారు.

మంగళవారం బంగారిగడ్డ పాఠశాలలో ఎంఈఓ గురువారావు అధ్యక్షతన 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ‘బడి బాట’ (ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట) కార్యక్రమ నిర్వహణపై మండల స్థాయి ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి యాదాద్రి భువనగిరి జిల్లా ఎఫ్‌ఏఓ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంఈఓ గురువారావు మాట్లాడుతూ గ్రామాల్లో బడి ఈడు పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ బడుల్లో ఉన్న వసతులు, నాణ్యమైన విద్యపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచాలని చెప్పారు.

ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు గ్రామాల్లో సభలు నిర్వహించడంతో పాటు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం చేయాలని సూచించారు. పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుతూ విద్యార్థులను ఆకర్షించేలా అలంకరించాలని తెలిపారు. ప్రభుత్వం ప్రారంభించిన ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రాధాన్యం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలను తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు.

‘బడి బాట’ షెడ్యూల్‌ను అన్ని పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply