సీఎం సభను విజయవంతం చేయాలి..

సీఎం సభను విజయవంతం చేయాలి..

చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా కాటారం మండలంలోని నస్తురుపల్లిలో ఈ నెల 20న నిర్వహించే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ విజయవంతం చేయాలని భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిదాసరి శ్రీహరి గౌడ్, కోరారు. ఆదివారం ఆయన ఆంధ్రప్రభతో మాట్లాడుతూ.. నస్తురుపల్లిలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారని తెలిపారు. జిల్లా నుండి రైతులు మహిళలు, సకాలంలో సీఎం బహిరంగ సభకు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. పేదల సంక్షేమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా, ప్రజా పాలన ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పని చేస్తుందని
శ్రీహరి గౌడ్ అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాల ప్రభుత్వం, విద్యా, వైద్యం, వ్యవసాయం పలు సంక్షేమ పథకాల కోసం పని చేస్తుందన్నారు. నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ గృహాలు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ 500 సబ్సిడీ పై గ్యాస్, రుణమాఫీ తదితర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో నియోజకవర్గం, అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. జిల్లాలోని రైతులు, మహిళలు యువకులు, సీఎం బహిరంగ సభకు భారీగా హాజరై విజయవంతం చేయాలని శ్రీహరి గౌడ్ కోరారు.

Leave a Reply