Dandepalli | సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం

Dandepalli | దండేపల్లి, ఆంధ్రప్రభ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కోరిక మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దండేపల్లి మండలంలోని గూడెం, ద్వారక, గుడిరేవు గ్రామాలకు మూడు లిఫ్టులను మంజూరు చేయడంతో ఇవాళ దండేపల్లి మండలంలోని మెదరిపేట బస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చిత్రపటానికి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని, రైతును రాజుగా చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. రాబోయే రోజుల్లో మండలాన్ని సస్యశ్యామలం చేసి, రైతుల కష్టాలు తీర్చుకొనేందుకు పాటుపడుతుదన్నారు. అనంతరం టపాకాయలు పేల్చుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చైర్మన్ కోట్నాక తిరుపతి, ఆర్ జి పి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కంది సతీష్ కుమార్, నాయకులు బోయిడి వెంగళ్ రావు, మెదరిపేట సర్పంచ్ చొప్పదండి అనూష రాజేష్, జాబు కాంతారావు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Dandepalli

Leave a Reply