CBN WORN  :  రౌడీయిజం చెల్లదు  Andhra Prabha News

CBN WORN  :  రౌడీయిజం చెల్లదు  Andhra Prabha News

నోరు జారితే కఠిన చర్యలే

ఇక సెటిల్మెంట్లు కుదరవు

బెదరిస్తే ఊరుకోం

బురద చల్లితే సహించం

కలియుగ వైకుంఠం..తిరుపతి

సెక్కూరిటీ .. సేఫ్టీ..భావన కలగాలి

తిరుపతిలో సీఎం చంద్రబాబు

( ఆంధ్రప్రభ, తిరుపతి ప్రతినిధి)

CBN WORN

ప్రజాస్వామ్యంలో  రాజకీయం పేరుతో రౌడీయిజం (No Rowdyism)  చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోం. రౌడీయిజంతో  పెద్ద నాయకుడు అవుతారని  భావిస్తే ఎలా.  తమ ఇంట్లో పెద్ద నాయకుడు కావచ్చేమో గానీ..  బయటకాదు,  బజారులోకి వచ్చి నోరు పారేసుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరోక్షంగా వైసీపీ నాయకులను (CBN WORN) హెచ్చరించారు. తిరుపతిలో నూతన జిల్లా పోలీసు (Police Office Opened)  కార్యాలయాన్ని శుక్రవారం సీఎం  ప్రారంభించారు.

CBN WORN

 అనంతరం   ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, తిరుపతిలో నూతన జిల్లా పోలీసు కార్యాలయం అద్భుతంగా నిర్మించారు. పరిసరాలు అందర్నీ ఆకట్టుకునేలా ఆహ్లాదంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం తిరుపతి, కలియుగ వైకుంఠంగా పిలిచే తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు.  దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు పూర్తి రక్షణ కల్పించాలి. ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో (Security) సెక్యూరిటీ, సేఫ్టీ  (Safty) భావన ప్రజల్లో, భక్తుల్లో రావాలి. అప్పుడే పోలీసుల  సేవల పట్ల ప్రజల్లో గౌరవం పెరుగుతుంది, అని సీఎం అన్నారు.

CBN WORN   : గుడ్​ కీప్​ ఇట్​ అప్​

CBN WORN

గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు కృషి చేస్తున్న తిరుపతి పోలీసులకు సీఎం  అభినందనలు తెలిపారు.  పీడీ యాక్టు పెట్టి సస్పెక్ట్ షీట్లు తెరిచి నిఘా పెట్టారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను సమర్ధంగా అరికడుతున్నారు.  సమాజ హితం లేని, రాజ్యాంగపరంగా లేని, చట్టవిరుద్ధ   చర్యలు ఎప్పుడూ ఆమోదయోగ్యం కావు, అక్రమాలకు పాల్పడితే టీడీపీ వారైనా కేసులు పెట్టి జైళ్లకు పంపించాం, అని సీఎం చంద్రబాబు వివరించారు.

CBN WORN

రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణ (State Boycott)  అని ప్రకటించాం.   సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం, అని సీఎం హెచ్చరించారు. 2019 .. -24 మధ్య పాలకులు శాంతిభద్రతలు (Law and Order Spoilt)  భ్రష్టు పట్టించారు. తిరుమల తిరుపతిలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారు.  మేం   అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా శాంతిభద్రతల్ని ఎప్పుడూ  చేతుల్లోకి తీసుకోలేదు. హత్యారాజకీయాలను ఎప్పుడూ ప్రోత్సహించలేదు. శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, అని సీఎం వివరించారు.

CBN WORN  : బెదిరించొద్దు

CBN WORN

 గత పాలకులు ఇష్టాను సారంగా చేసిన వ్యవహారాలతో ప్రజల్లోనూ రాష్ట్రంలోనూ ఇబ్బందులు తలెత్తాయి.  కొందరు ఇప్పటికీ అదే రౌడీయిజాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తున్నారు.  రోడ్లు బ్లాక్  (Roads Block) చేయటం, రప్పా రప్పా లాడించటం ఏమిటో ఎవరికీ ఆర్ధం కావటం లేదు.  పోస్టర్ల వద్ద కత్తులతో జంతు బలి (Animal Kill)  చేసి ఫ్లెక్సీలపై రక్తం చల్లి సమాజాన్ని భయబ్రాంతులకు గురిచేస్తారా.? అని సీఎం ప్రశ్నించారు.

CBN WORN

వివేకా హత్యకేసులో Viveka Murder Case) నేరం చేసిన వ్యక్తులు దానిని ఇతరుల పైకి వేసేందుకు ప్రయత్నించారు,  నేరస్తులు ఎన్ని డ్రామాలు ఆడినా ఎక్కడో ఓ చోట దొరికిపోతారు. నేరస్తుల కంటే పోలీసులు తెలివిగా వ్యవహరించాలి అని సీఎం ఆదేశించారు.

CBN WORN  : చూస్తూ ఊరుకోం

 బంగారు పాళ్యంలో మామిడి కాయలు తొక్కించారు. గుంటూరులో ఓ వ్యక్తిని కాన్వాయ్ కింద తొక్కించేసి పొదల్లో పారేసి పోయారు. అంబులెన్సులో తీసుకెళ్లి చంపేశారని  బంధువులతో చెప్పించారు. ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోం. సామాజిక మాధ్యమాలలో (Social media)  ఇంకా అసభ్య  (Abuse Posts) పోస్టులతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.

రాజకీయ ముసుగులో ఉండి నేరాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోం, చంద్రబాబు వార్నింగ్​ ఇచ్చారు.  ఎన్డీఏ భాగస్యామ్యంలో ఉన్న వారెవరూ ఈ తరహా లో వ్యవహరించటం లేదు.  పోలీసు వ్యవస్థ గట్టిగా ఉండాలి. నేరం జరిగిన తర్వాత వ్యవహరించే తీరు చాలా ముఖ్యం. దేవాలయాల్లో దాడులు, దొంగతనాలు ఇప్పుడు లేవు.

CBN WORN   : బీ అలెర్ట్​ ..

CBN WORN

వైకుంఠ ఏకాదశి సందర్భంగా పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా చిన్న ఘటన కూడా జరగడానికి వీల్లేదు. టెక్నాలజీని (Use Technology)  సమర్ధంగా వాడుకుని నేర నియంత్రణ చేయాలి. డ్రోన్స్  (Drones Petroling) ద్వారా పెట్రోలింగ్ చేస్తే విజువల్స్ ఆధారాలుగా మారతాయి. ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్ ఉండాలి.  కలియుగ వైకుంఠం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన  ఈ ప్రాంత పవిత్రతను కాపాడేలా పోలీసులు వ్యవహరించాలి, అని పోలీసులకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్దేశం చేశారు.

ALSO READ : Ap Cm Vision :  అభివృద్ధి యాత్ర ఆగదు Andhra Prabha Real News

Leave a Reply