Thota Raju | 16వ సారి రక్తదానం

Thota Raju | 16వ సారి రక్తదానం
Thota Raju | గన్నేరువరం, ఆంధ్రప్రభ : మండలంలోని మైలారం గ్రామానికి చెందిన తోటరాజు ఇవాళ 16వ సారి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచాడు. కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమెష్ (Ramesh) కి బి పాజిటివ్ రక్తం అవసరం ఏర్పడింది. కుటుంబ సభ్యులు అతనిని సంప్రదించగా.. కరీంనగర్ లోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కు వెళ్లి రక్తదానం చేశాడు. ఇప్పటికే పలుమార్లు రక్తకణాలు కూడా దానం చేశాడు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 16 సార్లు రక్తదానం (Blood Donate) చేయడం చాలా ఆనందంగా ఉందని, ఇప్పటికీ ఇంకా చాలా మంది యువత రక్తం ఇవ్వడానికి భయపడుతున్నారని, రక్తదానం చేయడం వల్ల అనేక ప్రాణాలు కాపాడవచ్చునని, రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదని, రక్తదానం చేయడం ఒక గొప్ప సేవని, ఒక ప్రాణాన్ని కాపాడటానికి రక్తదానం చేయడం కంటే గొప్ప విషయం మరొకటి లేదని, రక్తదానం చేయడానికి యువత నిర్భయంగా ముందుకు రావాలని కోరారు.
