Leopard | సిరిసిల్లలో చిరుత కలకలం..

Leopard | సిరిసిల్లలో చిరుత కలకలం..

Leopard| రాజన్న సిరిసిల్ల, ఆంధ్రప్రభ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత (Leopard) సంచారం తీవ్ర కలకలం రేపింది. రుద్రంగి (Rudrangi) లోని రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో చిరుత కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

స్థానికులు చిరుతను గమనించి వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు (Forest officials) రుద్రంగి, మర్రిమడ్ల, మనాల ప్రాంతాల్లో చిరుతల సంచ‌రించిన‌ట్లు ధృవీకరించారు. అధికారులు ప్రజలకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిరుత (Leopard) లను బంధించేందుకు బృందాలు ఏర్పాటు చేసి ఆపరేషన్ చేపట్టారు. ఈ ఘటనతో ప్రాంతంలో భద్రతా చర్యలు ముమ్మరం చేశారు.

Leave a Reply