rythu bharosa | నేడు రైతు భరోసా నిధుల జమ

rythu bharosa | నేడు రైతు భరోసా నిధుల జమ

rythu bharosa | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు.

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందించడం ద్వారా వ్యవసాయ రంగానికి ప్రభుత్వం బలమైన మద్దతు ఇస్తోందన్నారు.

రైతు భరోసా నిధుల పంపిణీతో రైతుల్లో ప్రభుత్వంపై విశ్వాసం మరింత పెరుగుతుందని మహేశ్‌కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.