Section 144 | 144 సెక్షన్ అమలు చేయాలి…

Section 144 | 144 సెక్షన్ అమలు చేయాలి…

Section 144 | సిద్దిపేట జిల్లా ములుగు, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్నందున క్లస్టర్ గ్రామపంచాయతీ చుట్టు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్(Section 144) అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హైమావతి(Haimavati) అధికారులను ఆదేశించారు.

ఈ రోజు మండల పరిధిలోని చిన్న తిమ్మాపూర్ గ్రామపంచాయతీ క్లస్టర్లో నామినేషన్ల ప్రక్రియ(nomination process)ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చిన్న తిమ్మాపూర్ క్లస్టర్లో తునికి బొల్లారం, చిన్న తిమ్మాపూర్, జప్తి సింగర్ పల్లి గ్రామాల సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు ఎంపీడీవో మేరీ స్వర్ణలత(MPDO Mary Swarnalatha) కలెక్టర్ వివరించారు.

చిన్న తిమ్మాపూర్ గ్రామపంచాయతీ క్లస్టర్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్కు(Help Desk)ను పరిశీలిస్తూ అభ్యర్థులకు ఆయా ఫామ్ లలో వివరాలు రాయడానికి క్లుప్తంగా వివరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారం నామిని అభ్యర్థి వివరాలు క్లుప్తంగా తనిఖీ చేశాకే నామినేషన్ పత్రాలను స్వీకరించాలని స్టేజ్ 1,2 ఆర్ ఓలకు తెలిపారు.

అనంతరం మొదటి రోజు వేసిన నామినేషన్ వివరాలను రిజిస్టర్లో పరిశీలించి ప్రతిరోజు టీ పోల్ లో వివరాలు అప్డేట్ చేయాలని, నామినేషన్ వేసే అభ్యర్థితో ఇద్దరిని మాత్రమే లోపలికి పంపాలని, నామినేషన్ వేసే కేంద్రాల వద్ద పకడ్బందీగా బందోబస్తు నిర్వహించాలని పోలీసు, అధికారులు ఆదేశించారు.

Leave a Reply