Delhi | రేపు మరోసారి ఢిల్లికి సీఎం రేవంత్‌ రెడ్డి

  • కేంద్ర మంత్రులతో భేటీ
  • ఏఐసీసీ పెద్దలతో సమావేశం

రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు, సమాలోచనలు జరిపేందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి సోమవారం మరోసారి ఢిల్లి వెళ్లనున్నారు. అలాగే పార్టీ సంస్థాగత అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు ఏఐసీసీ పెద్దలతోనూ సమావేశమై చర్చించనున్నారు.

ప్రభుత్వ పదవులకు సంబంధించి ఇటీవల తీసుకున్న మంత్రిమండలి నిర్ణయాలు, తదనంతర చర్యలు, పార్టీ పదవుల నియామకాల జాబితాపై ఈ సందర్భంగా అగ్రనేత రాహుల్‌ గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమాలోచనలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు.

Leave a Reply