Missing Case | మహిళా అదృశ్యం

గుడివాడ, ఆంధ్రప్రభ : ఘంటసాల మండలం డాలిపర్రు గ్రామానికి చెందిన తెనాలి ఝాన్సీ రాణి (భర్త వెంకటేశ్వరరావు) తన భర్తతో కలిసి 24వ తేదీన సుమారు సాయంత్రం మూడు గంటల సమయంలో భీమవరం వెళ్లడానికి గుడివాడ (Gudivada) ఆర్టీసీ బస్టాండ్ కు వచ్చింది. బస్సు బయలుదేరడానికి సమయం ఉందని ఆమె భర్త వెంకటేశ్వరరావు టాయిలెట్ కు వెళ్లి తిరిగి భీమవరం బస్సు వద్దకు రాగా, బస్సులో కూర్చుని ఉన్న తన భార్య కనిపించడం లేదని వాపోయారు. సుమారు ఐదు నెలల కిందట వారి కుమారుడు యాక్సిడెంట్లో చనిపోయినట్లు, అప్పటి నుండి ఆమె డిప్రెషన్ లో ఉంటున్నట్లు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కావున పై ఫోటోలోని ఆమె ఆచూకీ తెలిసిన యెడల ఈ క్రింది నెంబర్లకు సీఐ 8332983797, ఎస్ఐ 9440796424కు సమాచారం ఇవ్వవలసిందిగా గురువారం పోలీసులు తెలియచేశారు.
