నకిలీ విత్తనాలతో రైతులకు టోకరా
నకిలీ విత్తనాలతో రైతులకు టోకరా
- గింజలు లేని మొక్కజొన్న కంకులు ప్రత్యక్షం
- 500 ఎకరాల్లో రైతులకు నష్టం
- పల్లవి హైబ్రీడ్ సీడ్స్ షాప్ ఎదుట రైతుల ఆందోళన
నందికొట్కూరు , ఆంధ్రప్రభ : నకిలీ మొక్కజొన్నవిత్తనాలతో.. నంది కొట్కూరు(Nandi Kotkur) రైతులు దగా పడ్డారు. 500 ఎకరాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొక్కజొన్న(maize)తోట వేశారు. ఇబ్బడి ముబ్బడి కంకులు చూసి మురిసిపోయారు.
కానీ… ఆ కంకుల్లో గింజలు లేవని.. ఇక రావని తెలిసి.. రైతులు ఖంగుతిన్నారు. ఆ షాపు యజమాని తమకు నకిలీ విత్తనాలు అంటగట్టారని తెలిసి.. ఆగ్రహంతో ఊగిపోయారు. షాపు ఎదుట ధర్నాకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. నందికొట్కూరులోని పల్లవి హైబ్రీడ్ సీడ్స్(Hybrid Seeds) షాప్ వద్ద రైతుల ధర్నాఆందోళన వ్యక్తం చేశారు.
గత రెండు నెలల కిందట పల్లవి సీడ్స్ వద్ద పొలంలో మొక్కజొన్నపంట వేద్దామని నందికొట్కూరు లోని పల్లవి సీడ్స్ వద్ద మొక్కజొన్నవిత్తనాలు(Seeds) కోనుగోలు చేసిన రైతులు. ఆ రైతులకు Zeel CT 135 రకం మొక్కజొన్న విత్తనాలు రైతులకు ఇచ్చి పంపిన షాప్ యజమాని.
షాప్ అతను ఇచ్చిన zeel135 రకం విత్తనాలు వేసి రైతులు తీరా పంట మొలిచి కంకులు కాసే టైం లో కంకులు వచ్చిన లోపల విత్తనాలు లేకపోవడంతో మేము మోసపోయాం(cheated) అని మాకు పల్లవి సీడ్స్ యజమాని మాకు నకిలీ విత్తనాలు ఇచ్చారని పల్లవి సీడ్స్ షాప్ వద్ద రైతులు ఆందోళన చేశారు.
మాకు పంట చేతికి వచ్చే టైమ్(Time)లో ఇలా జరిగితే ఎలా అని రైతులు షాప్ యజమానితో వాగ్వాదం దిగారు. మేము 10 ఎక్కరల్లో మొక్కజొన్నపంట వేశామని తీర చూస్తే మొక్కజొన్న కంకి ఉన్నఅందులో విత్తనం లేదని మేము చాలా నష్టపోయని(Lost) రైతు ఆవేదన వ్యక్తం చేశారు .ఎలాగైనా సరే మాకు న్యాయం చేయాలని కేజీ రోడ్డుపై రైతుల ఆందోళన చేపట్టారు.
