Applications | దరఖాస్తులకు ఆహ్వానం..
Applications |ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మొవ్వ ఐసీడీఎస్ సీడీపీవో విఎస్.ప్రసన్న గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఘంటసాల మండలంలోని గోగినేనిపాలెం గ్రామంలో అంగన్వాడీ సహాయకురాలు ఓపెన్ కేటగిరి, ఘంటసాల -9 (సమైఖ్యత నగర్) అంగన్వాడీ సహాయకురాలు బీసీ-బీ, చల్లపల్లి -12లో అంగన్వాడీ సహాయకురాలు ఓపెన్ కేటగిరి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తునట్ల తెలిపారు.
అభ్యర్ధులు (వివాహిత మహిళలు మాత్రమే) స్థానికులు అయి ఉండాలని, నివాస ధృవీకరణ పత్రం 6 నెలలు దాటనిది, డోర్ నెంబర్ సహా నకలు జతపర్చాలన్నారు. 1.7.2025 నాటికి 21 సంవత్సరాలు నిండిన, 35 సంవత్సరాలలోపు వారు అర్హులని, ఖచ్చితంగా 10వ తరగతి పాస్ ఉండాలని తెలిపారు. దరఖాస్తులు 3.12.2025వ తేదీ సాయంత్రం 5 గంటల లోపుగా దరఖాస్తుదారులు స్వయంగా సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథక అధికారిణి, ఐసీడీఎస్ ప్రాజెక్టు, మొవ్వ కార్యాలయంలో సమర్పించాలని కోరారు.
