ప్రతిభకు గుర్తింపు
రాష్ట్ర స్థాయికి ఎంపిక
నాగాయలంక – ఆంధ్రప్రభ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (School Games Federation) ఆధ్వర్యంలో ఈనెల ఏడో తేదీన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గూడూరు నందు కబడ్డీ జిల్లా సెలక్షన్స్ జరిగినాయి. వీటిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాగాయలంక విద్యార్థి టి. వరుణ్ తేజ అండర్14 విభాగంలో రాష్ట్రస్థాయికి ఎంపికైనాడని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అలపర్తి సత్యనారాయణ (Alaparthi Satyanarayana) తెలిపారు. అద్భుత ప్రదర్శన కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన వరుణ్ తేజ్ ని పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ వక్కల గడ్డ లీలా మారుతి, పాఠశాల పీడీ గాజుల లక్ష్మీప్రసాద్, కే శివాజీ అభినందించారు. ఈనెల 10వ తేదీన మచిలీపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటాడు.

