రైతులకు అండగా కేడీసీసీ.

రైతులకు అండగా కేడీసీసీ.

కే డి సి సి చైర్మన్ నెట్టెం రఘురాం..
రైతులు, మహిళా సంఘాలకు రూ.3 కోట్ల ఆర్థిక చేయూత
జగ్గయ్యపేటలో చెక్కుల పంపిణీ..
మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఎమ్మెల్యే తాతయ్య
కేడీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా రఘురాం ఏడాది పూర్తి సందర్భంగా కేక్ కటింగ్

జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : రైతులు, డ్వాక్రా మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి సహకార రంగం కీలక పాత్ర పోషిస్తోందని కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (కేడీసీసీ) చైర్మన్, మాజీ మంత్రి నెట్టెం శ్రీ రఘురాం పేర్కొన్నారు. గౌరవరం, మంగోలు, కృష్ణ ఫార్మసీ సొసైటీల ఆధ్వర్యంలో రైతులు, డ్వాక్రా మహిళా సంఘాలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం శనివారం జగ్గయ్యపేటలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కృష్ణా సొసైటీ పరిధిలో సుమారు రూ.3 కోట్ల విలువైన చెక్కులను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ రైతులు, డ్వాక్రా మహిళా సంఘాల అభ్యున్నతే కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని చెప్పారు. రైతుల అవసరాలకు అనుగుణంగా కేడీసీసీ బ్యాంక్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు. రూ.3 కోట్ల ఆర్థిక సహాయం ద్వారా అనేక కుటుంబాలకు భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ రైతు సంక్షేమం, మహిళా సాధికారత ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని అన్నారు. ప్రజలకు మేలు చేసే ప్రతి కార్యక్రమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.

సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ రైతులకు, మహిళలకు సేవలందిస్తున్న రఘురాం కృషిని అభినందించారు. అనంతరం కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్‌గా నెట్టెం శ్రీ రఘురాం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళా సంఘాల సభ్యుల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గౌరవరం పీఏసీఎస్ అధ్యక్షుడు కట్టా వెంకట నరసింహారావు, పోచంపల్లి పీఏసీఎస్ అధ్యక్షుడు ముల్లంగి రామకృష్ణారెడ్డి, కృష్ణ ఫార్మసీ సొసైటీ అధ్యక్షుడు యానాల గోపీచంద్, మంగోలు పీఏసీఎస్ అధ్యక్షుడు బొల్లం పురుషోత్తం, గోపాలకృష్ణ సొసైటీ అధ్యక్షుడు ధూళిపాళ్ల లక్ష్మణరావు, జగ్గయ్యపేట మండల డ్వాక్రా సమాఖ్య అధ్యక్షురాలు నాయిని రజిని, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఇస్లావత్ శీను నాయక్, మహిళా సంఘాల సభ్యులు, లబ్ధిదారులు, కేడీసీసీ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply