కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థిని మిస్సింగ్

చాగలమర్రి, నంద్యాల జిల్లా (ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లాలోని చాగలమర్రి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థిని అదృశ్యమైన సంఘటన కలకలం రేపింది.

ఎస్సై సురేష్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం ..
కదిరిపురం తండాకు చెందిన మానిపాటి సుష్మా ప్రియ (వయసు 14), ఆరవ తరగతి విద్యార్థిని, శుక్రవారం ఉదయం పాఠశాల నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ విషయంపై విద్యాలయ అధికారులు పోలీసులకు సమాచారం అందించగా, విద్యార్థిని తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేశారు.

గత కొద్ది రోజులుగా చదువుపై ఆసక్తి చూపకపోవడం, ఇంటిపై బెంగ పెట్టుకొని ఎవరికి చెప్పకుండా కనిపించకుండా వెళ్లిపోయిందన్నారు.

ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థిని ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎస్సై సురేష్ నాయుడు తెలిపారు.

విద్యార్థిని గురించి సమాచారం తెలిసినవారు స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్సై సురేష్ నాయుడు (ఫోన్: 9121101168) కు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply