AP | చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

AP | చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

ఏపీ సీఎం చంద్రబాబు!

AP | అమరావతి (ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్): కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళా సాధికారత సాధించాలన్నదే తమ పార్టీ ఆశయమని, ఈ బిల్లు ఆమోదం పొందడం చారిత్రక అవసరమని ఆయన పేర్కొన్నారు.

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ మహిళా బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

గతంలో పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడే టీడీపీ తన మద్దతును బహిరంగంగా ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు.

రాజకీయ కారణాలు, ఇతర సాంకేతిక ఇబ్బందుల వల్ల గతంలో ఈ బిల్లు కార్యరూపం దాల్చలేదని, కానీ ఇప్పుడైనా అది ఆమోదం పొంది చట్టంగా మారాలని తాము బలంగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

సమాజంలో మహిళలకు సమాన అవకాశాలు దక్కినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, చట్టసభల్లో వారికి 33 శాతం ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా వారి గొంతు మరింత బలంగా వినబడుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

మహిళా రిజర్వేషన్ల కోసం దశాబ్దాలుగా సాగుతున్న నిరీక్షణకు ఈ చట్టంతో తెరపడాలని, దీనికి తమ ఎంపీలు పూర్తి సహకారం అందిస్తారని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.

Leave a Reply