ఘనంగా శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు

ఘనంగా శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు
బాసర, ఆంధ్ర ప్రభ : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం(Basara Sri Gnana Saraswati Kshetra)లో శ్రీ శారదీయ శరన్నవరాత్రి(Sharannavaratri) ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏడో రోజు ఆశ్వయుజ(Ashvayuja) శుద్ధ పంచమి ఆదివారం అమ్మవారు కాళరాత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఆలయ వైదికలు చతుషష్టి ఉపచార అష్టోత్తరనామార్చన పూజలు నిర్వహించి వివిధ కూరగాయలతో కూడిన కిచిడిని అమ్మవారికి నివేదించారు. రేపు మూలా నక్షత్రం సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఇబ్బందులు కలగకుండా ఈఓ అంజనీదేవి(Ashvayuja) ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
