నిజామాబాద్ ప్రతినిధి, మే 17 (ఆంధ్రప్రభ) : దూర్‌లో నిర్వహించే తిరంగా ర్యాలీలో నగర ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. భారత సైనికుల ఘన విజయం “ఆపరేషన్ సింధూర్ ”కు అద్దం పట్టేలా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “తిరంగా ర్యాలీ” కోసం ఇక్కడ ఇందూర్ నగరంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ కన్వీనర్ జి.వి. కృపాకర్ రెడ్డి అధ్యక్షతన సుభాష్ నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశం లో అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ మాట్లాడారు. పహల్గాం ఘటనలో ఉగ్రవాదులు భారతీయులపై చేసిన దారుణ హత్యలను దేశం మరచిపోదన్నారు.
ఆ ఘటనకు బదులుగా మోదీ ఆదేశాలతో భారతసైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో, కేవలం ఉగ్రవాద స్థావరా లపైనే దాడులు జరిపి 100మందికి పైగా ఉగ్రవాదులను మట్టు బెట్టడం గర్వకారణ మన్నారు. విజయానికి గుర్తుగా, జాతీయ గౌరవానికి సంకేతంగా, ‘మనమూ దేశం కోసం’ నినాదంతో మే 19న సాయంత్రం 4 గంటలకు ఇందూర్ నగరంలో భారీ తిరంగా ర్యాలీని రాజరాజేంద్ర చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీని ప్రజలందరూ సంఘీభావంతో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ధన్ పాల్ పిలుపుని చ్చారు. ఈ సమావేశంలో ఓంప్రకాశ్ దైమా, డా.వెంకటరమణ, యాదగిరి, నరసింహ, గజం ఎల్లప్ప, బుస్సాపూర్ శంకర్, పంచారెడ్డి ఎర్రన్న పాల్గొన్నారు.