నేడు భారత్, పాక్ ఢీ

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆసియా కప్ (Asia Cup) 2025 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం (సెప్టెంబర్ 28) ఫైనల్ ఫైట్‌కు అంతా సిద్ధమైంది. 41ఏళ్ల చరిత్రలో తొలిసారి భారత్ (India)- పాకిస్థాన్ (Pakistan) తుదిపోరులో అభిమానుల్లో తలపడనుండడం ఆసక్తి కలిగిస్తోంది. దుబాయ్ (Dubai) వేదికగా ఆదివారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 9వ సారి ఆసియా కప్ ట్రోఫీని ముద్దాడటానికి భారత జట్టు (Indian team) సిద్ధమైంది. అంతేకాకుండా, కెప్టెన్‌గా తన తొలి మల్టీ-నేషన్ టోర్నమెంట్‌ను గెలవడానికి సూర్యకుమార్ యాదవ్ సిద్ధంగా ఉన్నాడు.

మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే..?
భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే ఈ ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌ను భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి జియో హాట్‌స్టార్ (Jio Hotstar) యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు. టీవీలో మ్యాచ్‌ను చూడాలనుకునే వారు సోనీ స్పోర్ట్స్ (Sony Sports) ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.
పిచ్ ఎలా ఉందంటే..?
భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ (Dubai International Cricket) స్టేడియంలో జరగనుంది. దుబాయ్ పిచ్ సాధారణంగా బ్యాట్స్‌మెన్‌లకు అనుకూలంగా ఉంటుంది, ముఖ్యంగా సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటానికి ప్రయత్నించే వారికి ఇది బాగా తోడ్పడుతుంది. ప్రారంభంలో పేస్ బౌలర్లకు స్వింగ్ లభించి, మళ్ళీ ప్రమాదకరంగా మారవచ్చు. బంతి పాతబడిన తర్వాత స్పిన్ బౌలర్లు మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చు. గత రికార్డుల ప్రకారం, ఈ వేదికపై ఛేజింగ్ చేసే జట్లకు ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి.
వాతావరణ..
అక్యూవెదర్ ప్రకారం, భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్ జరిగే రోజు దుబాయ్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చు. ఇక్కడి చాలా మ్యాచ్‌లలో రెండవ ఇన్నింగ్స్‌లో డ్యూ కీలక పాత్ర పోషించింది, అందుకే ఇక్కడ ఛేజింగ్ చేసే జట్లకు ఎక్కువ విజయం లభించింది. ఫైనల్‌లో కూడా డ్యూ ఫ్యాక్టర్ నిర్ణయాత్మకంగా మారవచ్చు, కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కు మొగ్గు చూపే అవకాశం ఉంది.
రెండు జట్ల అంచనా ప్లేయింగ్ ఎలెవన్
భారత్ జట్టు అంచనా: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
పాకిస్తాన్ జట్టు అంచనా: సామ్ అయూబ్, సాహిబ్‌జాదా ఫర్హాన్, ఫకర్ జమాన్, సల్మాన్ ఆగా (కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.
