ప్రజా సమస్యలపైనే దృష్టి

ప్రజా సమస్యలపైనే దృష్టి
- పల్నాడు జిల్లా నూతన కలెక్టర్ గా కృతిక శుక్ల బాధ్యతలు స్వీకరణ
పల్నాడు రూరల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా నూతన కలెక్టర్(Collector)గా కృతిక శుక్ల శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. కృతిక శుక్ల పల్నాడు జిల్లా తొలి మహిళా(first woman) కలెక్టర్‌గా నియమితులు కావడం కూడా ఒక విశేషం. కుటుంబ సభ్యులతో కలెక్టరేట్ కు చేరుకున్న”శుక్లా” కు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.
అనంతరం కలెక్టర్ బాధ్యతలు(responsibilities) చేపట్టారు. ఈ సంధర్భంగా పలు శాఖల అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి కలెక్టర్‌కు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
2013- ఐఏఎస్ బ్యాచ్(IAS batch)కి చెందిన శుక్ల, కృష్ణ, కాకినాడ కలెక్టర్‌గా, మదనపల్లి సబ్-కలెక్టర్‌గా, గుంటూరు జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. ముఖ్యంగా పల్నాడు ప్రాంత ప్రజల సమస్యలను పరిగణలోకి తీసుకొని వాటిని పరిష్కరించేందు(to be resolved)కు తొలి ప్రాధాన్యతను ఇవ్వటం జరుగుతుందని చెప్పారు.
ప్రభుత్వ పథకాల అమలులో, తోటి అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల సహకారాన్నితీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తానన్నారు. ఇప్పటివరకు హెడ్ ఆఫీస్(head office)లో ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శిగా పనిచేస్తూ ఇక్కడకు బదిలీపై వచ్చారు.
జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరు తమవంతు సహకారాన్నిఅందించాలని ఆమె కోరారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె కలెక్టర్ ఛాంబర్‌లో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ(office) అధికారులు, సిబ్బంది, పలువురు ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలియజేశారు.
