Trial 31st | ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం

Trial 31st | ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం
Trial 31st | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ కోర్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్)కు సమన్లు జారీ చేసింది. జులై 31న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అలాగే బీఎల్‌ఎన్ రెడ్డి కూడా సమన్లు పొందిన వారిలో ఉన్నారు.
ఈ-కార్ రేసు నిర్వహణకు సంబంధించిన అనుమతులు, నిధుల వినియోగం, పరిపాలనా నిర్ణయాలపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. దర్యాప్తు అనంతరం ఛార్జ్‌షీట్‌ను కోర్టులో సమర్పించగా, కోర్టు దానిని పరిగణనలోకి తీసుకుంది.
విచారణ కొనసాగుతుండగా, తదుపరి హాజరు తేదీలను కోర్టు నిర్ణయించనుంది.
