చాట్రాయిలో మంత్రులను కలిసిన కలెక్టర్ వెట్రిసెల్వి..
ఏలూరు/చాట్రాయి, ఆంధ్రప్రభ : చాట్రాయి మండలంలో మంగళవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు హాజరైన రాష్ట్ర వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథిలను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్, నూజివీడు నియోజకవర్గ పరిశీలకుడు మారెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. యు. శోభ, డీసీహెచ్ఎస్ డా. సి.హెచ్. బేబీకమల, ఎన్టీఆర్ వైద్య సేవల జిల్లా కోఆర్డినేటర్ రాజీవ్, వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
