AP | పెదపేట రామాలయంపై వేసిన పిటీషన్ కొట్టివేత..
రామ భక్తులకు ఈ తీర్పు ఎంతో ఊరట
AP | కాళ్ళ, జులై 27 (ఆంధ్రప్రభ): ఆకివీడు పెదపేట రామాలయం పై వేసిన పిటీషన్ సుప్రీంకోర్టు కొట్టి వేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. కాళ్ళ మండలం పెదఅమిరం రఘురామకృష్ణంరాజు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత కొద్దిరోజులుగా పెదపేట రామాలయంపై మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ సుప్రీంకోర్టుకు వెళ్ళగా స్టేటస్కో వెల్లడించిన ఘటన అందరికీ తెలిసిందేనన్నారు.
హైకోర్టులో కొట్టివేసిన విషయాన్ని దాచిపెట్టి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని రఘురామ కృష్ణంరాజు తరపున న్యాయవాది వారి వాదనను వినిపించడంతో సుప్రీంకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. పెదపేట రామాలయం నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తవుతుందని, రామ భక్తులకు ఈ తీర్పు ఎంతో ఊరటనిచ్చిందన్నారు. తమ మతాన్ని ప్రేమిస్తూ పరమతాన్ని గౌరవించాలని, తాము మతసామరస్యాన్ని పాటిస్తామని, ఎదుటివారు కూడా పాటిస్తారని ఆశిస్తున్నట్లుగా వెల్లడించారు.
