యువతతోనే వికసిత్ భారత్–2047 లక్ష్యం..
భూపాలపల్లి, ఆంధ్రప్రభ: యువత భాగస్వామ్యంతోనే వికసిత్ భారత్–2047 లక్ష్యాన్ని సాధించవచ్చని భూపాలపల్లి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) వసంత కుమారి అన్నారు. సోమవారం ఐడీఓసీలో ‘మై భారత్-2026–27’ వార్షిక కార్యాచరణ ప్రణాళికపై నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
యువజన సంఘాలను బలోపేతం చేయడంతో పాటు యూత్ క్లబ్‌ల డిజిటల్ నమోదు, నాయకత్వ శిక్షణ, నషా ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమాలు, క్రీడలు, సేవా కార్యక్రమాలు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు చేపట్టనున్నట్లు తెలిపారు. యువత సామాజికాభివృద్ధిలో భాగస్వాములై దేశాభివృద్ధికి తోడ్పడాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా యువజన అధికారి భూక్య సంజీవ్, జిల్లా యువజన, క్రీడల అధికారి చిర్రా రఘు, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, డీఎంహెచ్‌వో డాక్టర్ మధుసూదన్, జిల్లా ఉపాధికల్పన అధికారి ఎం. మల్లయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ బి. నాగరాజు, అదనపు డీఆర్డీవో బి. సురేందర్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి కె. సుకీర్తి, ఎన్సీసీ అధికారి జి. రాజయ్య, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి బి. రాజు తదితరులు పాల్గొన్నారు.
