కన్నాయిగూడెంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ: మండల రైతు వేదికలో సోమవారం రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్‌లు కలిసి పంపిణీ చేశారు.
ఈ పంపిణీలో భాగంగా గుర్రవుల గ్రామానికి చెందిన పటేల్ స్వప్నకు రూ.25,200, బుట్టాయిగూడెంకు చెందిన జాడి భాను దుర్గ హర్షన్కు రెండు చెక్కుల ద్వారా రూ.13,000 మరియు రూ.5,500, కొత్తూరుకు చెందిన కుమ్మరి సమతకు రూ.32,500, అలాగే దేవాదుల గ్రామానికి చెందిన బొల్లె రంజిత్‌కు రూ.15,000 విలువైన ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. ఆపద కాలంలో ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయం పేద కుటుంబాలకు ఎంతో భరోసానిస్తుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ అప్సర్ పాషా, మండల ఇన్చార్జి (బుట్టాయిగూడెం సర్పంచ్) జాడి రాంబాబు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోట నాగేష్, సర్పంచ్‌లు చింత చంద్రయ్య, కోరం నర్సయ్య, పీరీల స్వప్న, అల్లెం అనిత, అంబాలా సౌజన్య, తిప్పనపల్లి లక్ష్మయ్య, పార్టీ నాయకులు ఆలం రాంబాబు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
