మైత్రీ మూవీస్ నుంచి క్రైమ్ కామెడీ!
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: మైత్రి మూవీ మేకర్స్ మరో వినోదాత్మక చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. లిటిల్ హర్ట్స్ ఫేమ్ మౌళి హీరోగా ‘దొంగ నా కొడుకు’ (Donga Naa Koduku) పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. ఈ చిత్రం రాబరీ నేపథ్యంలో సాగే క్రైమ్ కామెడీగా రూపొందుతున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమా సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రబృందం నేడు విడుదల చేసింది.
“Beware… #DongaNaaKoduku is here to steal a few laughs” అంటూ విడుదల చేసిన ప్రకటనలో, ఈ సినిమా నవ్వులతో పాటు వినోదాన్ని పంచే రాబరీ క్రైమ్ కామెడీగా ఉండబోతోందని తెలిపింది. ‘#MouliRobsMythri’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో చేసిన ప్రచారం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు శ్రీను కంబలా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రధాన పాత్రలో మౌళి నటిస్తుండగా, కథానాయికగా సుషీ కనిపించనున్నారు. ఈ చిత్రానికి సింజిత్ యెర్రమిల్లి సంగీతం అందిస్తున్నారు.
కాగా మైత్రి మూవీస్ నుంచి వస్తున్న ఫుల్ లెన్త్ కామెడీ చిత్రం ఇది. త్వరలోనే సినిమా విడుదల తేదీతో పాటు ఫస్ట్‌లుక్, టీజర్ వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. ‘దొంగ నా కొడుకు’ తో మరోసారి మౌళి బ్లాక్ బాస్టర్ కి సిద్ధం అవుతున్నాడు.

