1stMayeditorial | ఎగ్జిట్ పోల్స్‌పై దేశవ్యాప్తంగా వివాదం

1stMayeditorial | ఎగ్జిట్ పోల్స్‌పై దేశవ్యాప్తంగా వివాదం

1stMayeditorial | ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి?
విశ్వసనీయతపై పెరుగుతున్న అనుమానాలు
మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
మీడియా, రాజకీయాల మధ్య సంబంధం

1stMayeditorial | ఎగ్జిట్ పోల్స్ అంటే పోలింగ్ సమాప్తమైన తర్వాత ప్రజల నాడిని తెలియజేసే విధానం. ఇది గతంలో ఖచ్చితంగా ఉండేది. ఇప్పుడు దానిని పార్టీ చానల్స్లో ప్రసారం కోసం ఏ పార్టీకి మటుకు ఆ పార్టీ సొంతంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేస్తుండటంతో వాటిలోని విశ్వసనీయతపై ప్రజలకు నమ్మకం కుదరడం లేదు.

గతంలో ఏ పార్టీకీ చెందని సంస్థలు ఈ పోల్స్ ఫలితాలను వెల్లడించేవి. అవి వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేవి. రాను రాను అవి పార్టీల పట్ల పక్షపాతం చూపే ధోరణిలో ఉంటున్నాయంటూ ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించవద్దని ఎన్నికల సంఘం నిషేధించింది. ఇప్పుడు ప్రభుత్వమే వాటిని ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఎగ్జిట్ పోల్స్ను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్ అని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో చివరి దశ (రెండవదశ) పోలింగ్ జరిగిన బుధవారం ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అన్ని మీడియా సంస్థలకు బీజేపీ పంపినట్టు తన వద్ద ఖచ్చితమైన సమాచారం ఉందని ఆమె ఆరోపించారు.

ఆమె రాజకీయనాయకురాలు అయినప్పటికీ, ముఖ్యమంత్రి హోదాలోనే ఈ ప్రకటన చేశారు. అంటే, ఆమెకు నిఖార్సైన సమాచారం వచ్చి ఉండవచ్చు. బెంగాల్లో 230 స్థానాలకు గాను 226 సీట్లలో తృణమూల్ గెలుస్తుందని బీజేపీకి అర్థమైందనీ, దాంతో అన్ని మీడియా సంస్థలకూ ఎగ్జిట్ పోల్స్ పేరిట బీజేపీ నెగ్గబోతోందన్న సమాచారాన్ని పంపించారని మమత ఆరోపించారు.

ఎగ్జిట్ పోల్స్ గతంలో వేర్వేరు సంస్థలు నిర్వహించినవి ఫలితాలు వేర్వేరుగా వచ్చేవి. ఇప్పుడు ఒకే రీతిలో ఫలితాలు రావడంతో ప్రజలకు కూడా అనుమానం కలుగుతోంది. దీంతో మమత చేసిన ఆరోపణ అవాస్తవం కాదేమో అనిపిస్తోంది. స్టాక్ మార్కెట్ పతనాన్ని, ప్రతిపక్ష కార్యకర్తల స్థైర్యాన్నీ దెబ్బతీయడం కోసమే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మీడియా ద్వారా వెల్లడించారని ఆమె ఆరోపించారు.

మీడియా సంస్థలు సైతం పార్టీల వారీగా సమీకరణ అయినందున వాటి ద్వారా తమ పార్టీ ప్రయోజనాలను కాపాడుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే సంస్థలకు జవాబుదారీ లేకుండా పోయింది. ఎగ్జిట్ పోల్స్ పార్టీల వారీగా ఆయా సంస్థలు వెలువరిస్తుండటంతో వాటిని జనం నమ్మడం లేదు.

కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడైనప్పటికీ, ఎఐసిసి నాయకుడు, రాహుల్ సన్నిహితుడు అయిన కేసీ వేణుగోపాల్ తాము ఎగ్జిట్ పోల్స్ని విశ్వసించడం లేదని, అసలైన ఫలితాలు వచ్చేవరకూ స్పందించబోమని అన్నారు. యూడీఎఫ్ గెలుస్తుందన్న సమాచారాన్ని పురస్కరించుకుని సంబరాలు జరపుకోవద్దని ఆయన తమ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

బెంగాల్లో రాబోయే ఫలితాలపై బీజేపీ నాయకులు జోస్యాలు చెప్పడాన్ని పలువురు ప్రతిపక్ష నాయకులు విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో బెంగాల్పై గురి పెట్టిన కేంద్రంలో అధికార పార్టీ రెండవ దశ పోలింగ్ ముగియకుండానే ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిందని పలువురు ప్రతిపక్షనాయకులు ఆరోపించారు. మొత్తం మీద ఈసారి ఎగ్జిట్ పోల్స్ ఎన్నడూ లేనంతగా వివాదాస్పదం అయ్యాయి.