నవాబుపేట శివాలయ నిర్మాణానికి రూ.50,116 విరాళం

దాతలను అభినందించిన ఆలయ కమిటీ

చిట్యాల, ఆంధ్రప్రభ: మండలంలోని నవాబుపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి బిళ్ళ భగవాన్ రెడ్డి, రేఖ దంపతులు సోమవారం రూ.50,116 విరాళం అందజేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన శివాలయం పునర్నిర్మాణం కోసం గ్రామస్తులు, దాతలు ఉదారంగా విరాళాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణ పనులు భక్తుల సహకారంతో కొనసాగుతున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మందల రాఘవ రెడ్డి, బిళ్ళ సత్యనారాయణ రెడ్డి, సర్వ శరత్, కొక్కుల సారంగం, వలబోజు నరేష్ తదితరులు పాల్గొన్నారు.