సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన..

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన..

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండల పరిధిలోని ఆరెగూడెం గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. జాతీయ రహదారి నుండి ఆరెగూడెం గ్రామానికి వచ్చే రోడ్డులో ఉన్న కనకదుర్గమ్మ గుడి ముందు చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు స్థానిక సర్పంచ్ ఎన్నెపల్లి ధనలక్ష్మి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ​

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజల సౌకర్యార్థం ఈ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం గ్రామంలో కామినేని హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామస్థులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. ​ఈ కార్యక్రమాలలో పంచాయతీ కార్యదర్శి డి. రాజేందర్ రెడ్డి, గ్రామ పెద్దలు, వార్డు ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.