ప్రచార పర్వంలో ముందంజ…దూసుకుపోతున్న శైలజ నర్సయ్య గౌడ్
ప్రచార పర్వంలో ముందంజ…దూసుకుపోతున్న శైలజ నర్సయ్య గౌడ్
- బ్రహ్మరథం పడుతున్న ఓటర్లు
- 7 వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్ధి గనగాని శైలజ నర్సయ్య గౌడ్
మోత్కూర్, ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ)మోత్కూర్ మున్సిపాలిటీ లో 7 వ వార్డు అభ్యర్థి గనగాని శైలజ నర్సయ్య గౌడ్ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు.గురువారం ఎమ్మెల్యే మందుల సామెల్ ఇంటింటి ప్రచారం లో అభ్యర్థితో కలిసి వడ్డెర కాలని,డ్రైవర్స్ కాలని,పద్మశాలి కాలని,వెంకటేశ్వర కాలనిలలో ప్రచారం లో పాల్గొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఓటర్లకు వివరిస్తూ ఓట్లు అభ్యర్ధిస్తున్నారు.
ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ,సీపీఐ కార్యకర్తలు,మద్దతు దారులతో భారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.వార్డ్ సభ్యునిగా గెలిచి ఉపసర్పంచ్ గా పనిచేయడంతో పాటు,మున్సిపల్ కో ఆప్షన్ గా పనిచేసిన అనుభవం కలిగిన తమను కౌన్సిలర్ గా గెలిపిస్తే 7 వ వార్డును ఎమ్మెల్యే సామెల్ సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడంతో పాటు ఆదర్శవార్డుగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నారు. వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు,వీధి లైట్లు,విద్యుత్ స్తంభాల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణ,మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ,ఈ నెల 11 న జరిగే ఎన్నికల్లో చెయ్యి గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు.
