మహంకాళికి సీఎం రేవంత్ బోనం

రాష్ట్ర ప్రభుత్వం తరఫున బోనం, పట్టువస్త్రాల సమర్పణ
మహంకాళి ఆశీస్సులు పొందిన సీఎం
శాంతి, సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు చేశారు.

హైదరాబాద్, ఆంధ్రప్రభ : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులతో కలిసి జగన్మాతకు బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజలందరూ సుఖసంతోషాలు, శాంతి, ఆయురారోగ్యాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి అమ్మవారిని ప్రార్థించారు. లష్కర్ బోనాల జాతరలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దనసరి అనసూయ (సీతక్క), పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.