బాలున్ని పనిలో పెట్టుకున్న ఓనరుపై కేసు..

జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జిలేబి సెంటర్లో 11 ఏళ్ల బాలకార్మికున్ని పనిలో పెట్టుకున్న ఓనరు భీమ్రావు పై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ ఆదివారం సాయంత్రం తెలిపారు.

ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా మంచిర్యాల ఇన్చార్జి లేబర్ ఆఫీసర్ శ్రీకాంత్, ఎస్సై నూనె శ్రీనివాస్ బృందం మండల కేంద్రంలోని పలు హోటల్లు, షాపుల్లో తనిఖీలు నిర్వహించగా, ఆ తనిఖీల్లో జిలేబి సెంటర్లో బాల కార్మికుడు పనిచేస్తున్నట్లు గుర్తించారని ఆయన చెప్పారు. దీంతో ఆపరేషన్ ముస్కాన్ బృందం ఇన్చార్జి లేబర్ ఆఫీసర్ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఆ జిలేబి సెంటర్ ఓనరు భీమ్రావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.