కనకదుర్గమ్మను దర్శించుకున్న సీసీఎల్‌ఏ జయలక్ష్మి
- కుటుంబ సమేతంగా అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి..
- ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో వీ.కే. శీనానాయక్..
( ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీసీఎల్‌ఏ (చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) మరియు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. జయలక్ష్మి శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆమెకు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి వీ.కే. శీనానాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా, దేవస్థానం తరఫున అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాలను ఈవో వీ.కే. శీనానాయక్ అందజేశారు.
