వంగవీటి మోహనరంగాకు మంత్రి కొల్లు రవీంద్ర నివాళి

రాధా–రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా 79వ జయంతి వేడుకలు

మచిలీపట్నం, ఆంధ్రప్రభ: స్వర్గీయ వంగవీటి మోహనరంగా 79వ జయంతి సందర్భంగా మచిలీపట్నంలోని రేవతి సెంటర్‌లో రాధా–రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వంగవీటి మోహనరంగా విగ్రహానికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, రాధా–రంగా మిత్రమండలి నాయకులు, బుల్లెట్ ధర్మ, కూటమి నాయకులు కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

రంగా సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, రంగా అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.