రెండేళ్లలో అభివృద్ధి–సంక్షేమం ప్రజలకు చేరువైంది

  • స్థానిక64వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్

పాయకాపురం, ఆంధ్రప్రభ): కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో ప్రజలకు అందించిందని స్థానిక 64వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్ అన్నారు.

టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు స్థానిక 64వ డివిజన్‌లో రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం పేరుతో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు కె. రవికుమార్ కమిటీ సభ్యులతో కలిసి ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని రవికుమార్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జి వింజమూరి సతీష్, కె. వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ఎస్.కె. బాబు, యూనిట్ ఇన్‌చార్జిలు కోమరి రాజేష్, మైనారిటీ నాయకుడు గౌస్ బాషా, బూత్ కన్వీనర్ కంకణాల బాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.