గూడూరు ఏపీఎం సస్పెన్షన్…
- విచారణ అనంతరం డీఆర్‌డీఏ పీడీ ఉత్తర్వులు
గూడూరు, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రభలో జూన్ 29న ప్రచురితమైన ‘వెలుగు’లో అవినీతి చీకట్లు..! కథనాన్ని ఆధారంగా తీసుకుని డీఆర్‌డీఏ–సెర్ప్ అధికారులు విచారణ చేపట్టగా, ఆరోపణలు ప్రాథమికంగా నిజమేనని తేలింది. దీంతో గూడూరు మండల సమాఖ్య అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ (ఏపీఎం) నలగాటి వీరయ్యను సస్పెండ్ చేస్తూ డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ సి. మధుసూదన రాజు ఉత్తర్వులు జారీ చేశారు.
విచారణలో విధులకు మద్యం సేవించి హాజరుకావడం, మహిళా ఉద్యోగులతో అనుచితంగా ప్రవర్తించడం, అనుమతి లేకుండా గైర్హాజరు కావడం, వీఓఏల నుంచి నగదు లావాదేవీలు జరిపినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెన్షన్ విధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
