NEWS@5:00 P.M | 11 జూలై 2026 ముఖ్యాంశాలు
అదే ఇరానీయులకు ఆఖరి రోజు..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. “నాపై హత్యకు ప్రయత్నిస్తే… అదే ఇరానీయులకు ఆఖరి రోజు” అంటూ ట్రంప్ చేసిన హెచ్చరిక అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇది కేవలం రాజకీయ వ్యాఖ్య మాత్రమే కాదు… ఇరాన్‌కు అమెరికా పంపిన అత్యంత కఠినమైన వ్యూహాత్మక సందేశంగా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. click here to read the full story
తిరుమలలో వాహనాల భారీ క్యూ
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. రేపటి నుంచి మూఢాలు ప్రారంభం కానుండటంతో, శుభ ముహూర్తాలు ముగిసేలోపు స్వామివారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో వేలాది మంది భక్తులు కొండకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీతో పాటు వాహనాల రాకపోకలు కూడా గణనీయంగా పెరిగాయి. click here to read the full story
రేవంత్‌తో ఏమిరేట్స్ ప్రతినిధుల భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో ఏమిరేట్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సార్థన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ను విమానయాన, క్రీడారంగాల్లో అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా పలు కీలక ప్రతిపాదనలపై ఇరువర్గాలు చర్చించాయి. click here to read the full story
హైదరాబాద్‌లో తొలి సీఎంపీ టెక్నాలజీ హబ్
సెమీకండక్టర్ రంగంలో తెలంగాణ మరో కీలక మైలురాయిని చేరుకుంది. దేశంలోనే తొలి సీఎంపీ (కెమికల్ మెకానికల్ పాలిషింగ్) ప్యాడ్ టెక్నాలజీ హబ్ హైదరాబాద్‌లోని టీ-వర్క్స్ కేంద్రంలో ప్రారంభమైంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శనివారం ఈ హబ్‌ను ప్రారంభించారు. జపాన్‌కు చెందిన తోహో కోకి సంస్థ సాంకేతిక సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. click here to read the full story
బొగ్గు గ్యాసిఫికేషన్‌లోకి సింగరేణి
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) బొగ్గు ఆధారిత ఇంధన రంగంలో మరో ముందడుగు వేయనుంది. భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ (అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్) రంగంలోకి ప్రవేశించేందుకు సంస్థ సన్నాహాలు ప్రారంభించింది. ఈ మేరకు బెల్లంపల్లి డిప్‌సైడ్ బ్లాక్‌లో పైలట్ ప్రాజెక్టు అమలుకు అవసరమైన డ్రిల్లింగ్ పనుల ఏర్పాట్లు జరుగుతున్నట్లు సంస్థ సీఎండీ డాక్టర్ బుద్దప్రకాశ్ జ్యోతి వెల్లడించారు. click here to read the full story
ఎల్ నినో ముప్పు.. ప్రపంచానికి కొత్త సవాల్?
ప్రపంచ వాతావరణ పరిస్థితుల్లో మరోసారి ఎల్ నినోపై చర్చ మొదలైంది. పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు నమోదవుతున్న నేపథ్యంలో రానున్న నెలల్లో ఎల్ నినో ప్రభావం పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. click here to read the full story
న్యాయ పోరాటం చేస్తాం..
నేరెళ్ల ఘటన బాధితుడు గంధం గోపాల్ మృతిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2017లో రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఘటన అనంతరం పోలీసుల చిత్రహింసలకు గురైన గోపాల్, గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం అత్యంత బాధాకరమని ఆమె పేర్కొన్నారు. click here to read the full story
హుజూర్‌నగర్‌కు కొత్త బస్టాండ్..
హుజూర్నగర్ నూతన బస్టాండ్‌కు శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఆర్టీసీ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని పనిచేస్తోందని అన్నారు. click here to read the full story
భారత్–న్యూజిలాండ్ బంధం మరింత బలోపేతం
న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఆక్లాండ్‌లో నిర్వహించిన భారతీయ ప్రవాసుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ రెండు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహబంధాన్ని గుర్తు చేశారు. భారత్–న్యూజిలాండ్ సంబంధాలు ప్రజల మధ్య ఉన్న అనుబంధంతో మరింత బలపడుతున్నాయని పేర్కొన్నారు. క్రీడలు, వాణిజ్యం, సాంకేతికత, అంతరిక్షం, విద్య తదితర రంగాల్లో రెండు దేశాలు కలిసి మరిన్ని విజయాలు సాధించగలవని విశ్వాసం వ్యక్తం చేశారు. click here to read the full story
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన ఏడు బుల్లెట్ రైలు కారిడార్లలో మూడు తెలంగాణకు సంబంధించినవేనని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవతో రాష్ట్రానికి ఈ ప్రతిష్ఠాత్మక హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు లభించాయని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ దేశంలోనే కీలక బుల్లెట్ రైలు కేంద్రంగా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. click here to read the full story
