నేడు జైనూర్ లోఎస్ఐఆర్ పై మెగా ప్రత్యేక క్యాంప్

జైనూర్, ఆంధ్రప్రభ: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని ఉస్మాన్ కేరళ గ్రామర్ పాఠశాలలో ఆదివారం ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ కోసం మెగా ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు జైనూర్ తహసీల్దార్ అడబీర్ షావ్ తెలిపారు.

ఈ శిబిరంలో రెవెన్యూ సిబ్బందితో పాటు 30 మంది ప్రత్యేక వాలంటీర్లు పాల్గొని ప్రజలు తీసుకువచ్చిన ఎస్‌ఐఆర్ దరఖాస్తులను నింపించి, వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారని తెలిపారు. ఓటర్లందరూ ఈ ప్రత్యేక శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఎస్‌ఐఆర్ ఫారాలను పూర్తి చేసి అక్కడికక్కడే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని తహసీల్దార్ సూచించారు.