ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత

  • నీలం మధు ముదిరాజ్

సంగారెడ్డి, ఆంధ్రప్రభ: నూతన దేవాలయాల నిర్మాణంతో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందుతుందని, ఆధ్యాత్మికత ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు సానుకూల శక్తి లభిస్తుందని మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు.తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని జ్యోతిరావు ఫూలే కాలనీలో వెలసిన విజయదుర్గా పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో శివ పంచాయతన సహిత నవగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్ ఆధ్వర్యంలో గురువారం వైభవంగా ముగిసింది. జూన్ 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.

ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తి భావం ప్రతి వ్యక్తిలో మానసిక ప్రశాంతతను పెంపొందించి సమాజంలో సౌభ్రాతృత్వాన్ని బలోపేతం చేస్తుందని అన్నారు. గ్రామాల్లో ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజలకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరాలని ఆకాంక్షించారు.

ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని విజయవంతం చేసిన ఫౌండర్స్ కొల్లూరి అమృత సత్యయ్య దంపతులు, కొల్లూరి భరత్, ఆలయ కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రజలందరిపై భగవంతుని కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో చిన్న శ్రీశైలం యాదవ్, మాజీ కార్పొరేటర్ పుష్పనాగేష్ యాదవ్, పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, డాకూర్ రామ్ మోహన్ రెడ్డి, లింగం, మధుసూదన్, రవి చారి, పాండు, బాబు గౌడ్, ఐలేష్ యాదవ్, ధరణి రాజు, రాజేష్, లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.