నిజాంపేట మండలంలో రెండు అంగన్వాడీ టీచర్ పోస్టులు
నిజాంపేట (ఆంధ్రప్రభ): ఐసీడీఎస్ రామాయంపేట–నిజాంపేట ప్రాజెక్టు పరిధిలోని చల్మెడ, వెంకటాపూర్ (కె) గ్రామాలకు అంగన్వాడీ టీచర్ (ఏడబ్ల్యూతీ), గిరిజన అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మి తెలిపారు. నిజాంపేట మండలంలో మొత్తం రెండు అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత గ్రామపంచాయతీ కార్యాలయాలకు పంపనున్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థుల నుంచి జూలై 10 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు.
విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం తదితర వివరాలు అధికారిక నోటిఫికేషన్లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు నిర్ణీత గడువులోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
