Plastic ban | ప్లాస్టిక నిషేధంపై పర్యవేక్షణేదీ…

Plastic ban | ప్లాస్టిక నిషేధంపై పర్యవేక్షణేదీ…

  • యథేచ్ఛగా ప్లాస్టిక కవర్ల వాడకం
  • తూతూ మంత్రంగా తనిఖీలు
  • ఎక్కడ కనిపించని ప్లాస్టిక నిషేధం
  • ప్లాస్టిక వ్యర్థాలతో మూగజీవులకూ పొంచి ఉన్న ప్రమాదం
  • పట్టించుకోని మున్సిపల్‌ అధికారులు

జోగిపేట, (ఆంధ్రప్రభ‌): నిత్యం ప్లాస్టిక్‌ వాడకం ఎక్కువ అవ్వడంతో జీవ నైవిద్యానికి పెనుముప్పు కలుగుతోంది. నిషేధిత ప్లాస్టిక్‌ కవర్లు విచ్చలవిడిగా ప్రతి దుకాణాల్లో వాడుతున్నా సంబంధిత శాఖ దృష్టి సాధించడం లేదు. అందోల్‌ జోగిపేట మున్సిపల్‌ పట్టణంలో నిత్యం ప్లాస్టిక్‌ వాడకం పెరుగుతుండడంతో మూగజీవులకు ప్రమాదం పొంచి ఉండడమే కాకుండా, మురికి కాల్వలు చెత్త చదరంగా మారుతుంది. ప్లాస్టిక్‌ వాడకం నియంత్రాన్ని పూర్తిగా నిషేధించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

విచ్చలవిడిగా Plastic కవర్ల వాడకం..

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్‌ కవర్ల వాడకం రోజు రోజుకు పెరిగిపోతుంది. మున్సిపాలిటీల తోపాటు ఈ ప్లాస్టిక్‌ వాడకం మార్మూ ల గ్రామాలకు సైతం పాకి పోయిందని చెప్పవచ్చు. అడవి, పర్యావరణ పరి రక్షణ1986 చట్టం ఉత్తరు 25 ప్రకారం 40 మైక్రాన్లు(మందం) కంటే తక్కువ పాలీథీన్‌ సంచులను వాడకూడదు.

తెలుపు కవర్లు తప్ప (నలుపు, నీలం) రం గు కవర్లు వాడడానికి ఆస్కారం లేదు. గ్రామస్థాయిలో పంచాయితీ కార్యద ర్శిలు వీటిపై పర్యవేక్షించాల్సిన అవస రం ఉంది. నిబంధనలు ఉన్నా రహస్య ప్రాంతాలు, గోదాముల్లో వీటిని నిలువ చేసి పలు దుకాణాలు, హోటళ్లకు తక్కువ మైక్రాస్తు ఉన్న వాటిని విక్రయి స్తున్నారు. కవర్లతో ఆయా గ్రామాలతో పాటు- మున్సిపాలిటీ-లో లక్షల వ్యాపా రం కొనసాగుతుంది.

Plastic ban | అవగాహన కల్పిస్తేనే అమలు సాధ్యం..

ప్లాస్టిక్‌ వాడటంతో కలిగే అనర్థాల గురించి సంబంధిత అధికారులు మున్సిపాల్‌, గ్రామ స్థాయిలో కళాజాత బృందాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తే ప్లాస్టిక్‌ వాడ కం తగ్గడానికి ఉపయోగంగా ఉంటుంది. పేపర్‌ గ్లాసులు, జూట్‌ బ్యాగులు వినియోగించేలా అధికారులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. యువత సోషల్ మీడియా ద్వారా ప్లాస్టిక్ నిషేధంపై ప్రచారం చేస్తే, ప్లాస్టిక్ కవర్ల నియంత్రణకు కొంతవరకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది.

Plastic తో కలిగే నష్టాలు..

వాతావరణంలో కాలుష్యం పెరు గుతుంది. ప్లాస్టిక్‌ లో ఉండే రసాయ నాలు మొక్కలు పెరగకుండా అడ్డుకుం టాయి. భూసారం దెబ్బతింటుంది. వేడి ఆహార పదార్థాలు వీటిలో నిల్వ ఉంచడంతో ఆహారం పూర్తిగా విషపదార్థంగా మారుతుంది. ప్లాస్టిక్‌ రీసైకిలింగ్‌లో వచ్చే కోరినేటెడ్‌ హైడ్రో కార్బన నాడీ మండలాన్ని దెబ్బతీస్తుంది. మెదడుపై ప్రభావం చూపుతుంది. పిల్లలు ఊబాకా యలుగా మారుతారు. ప్లాస్టిక్‌ తినడం ద్వారా పశువులు, మేకలు, గొర్రెలకు ప్రమాదం పొంచి ఉంది.

పల్లెల్లో సైతం Plastic వినియోగం..

పట్టణాలకే పరిమితమైన పాలిథిన్‌ కవర్ల వినియోగం పల్లెలకు సైతం విపరీ తంగా వ్యాపించింది. దీంతో గ్రామాల్లో నిత్యావసర వస్తువులు ఏది కొనుగోలు చేసినా, ప్లాస్టిక్‌ కవర్లలో వేసి ఇస్తున్నారు. వినియోగదారులు ఈ కవర్లను బయట ఎక్కడ పడితే అక్కడ పడేస్తుండటంతో పశువులు వాటిని తిని అనారోగ్యానికి గురవుతున్నాయి.

కవర్లను కాల్చడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లడం తోపాటు అనారోగ్యం బారిన పడుతు న్నారు. సంబంధిత అధికారులు మున్సిపాలిటీ తోపాటు గ్రామాల్లో ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని, ప్లాస్టిక్‌ కవర్లను అమ్మే వారిపై చర్యలు తీసుకుంటే వాడకం తగ్గుతుందని ప్రజలు సూచిస్తున్నారు.

iBOMMA | రవి అరెస్ట్ తో పైరసీ కనుమరుగేనా..