విద్యుత్ కార్యాలయంలో ఘనంగా బసవ జయంతి…

విద్యుత్ కార్యాలయంలో ఘనంగా బసవ జయంతి…
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి విద్యుత్ కార్యాలయంలో సోమవారం బసవ జయంతి సందర్భంగా పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఇండస్ట్రియల్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొని బసవేశ్వరునికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సర్కిల్ ఎస్‌ఈ ఆర్.సుధీర్ కుమార్, డీఈ (టెక్నికల్) శ్రీనివాస్, ఎం.మహేష్, ఏడీఈ కన్స్ట్రక్షన్ టి.శ్రీకాంత్, ఏడీఈ సివిల్, బీసీ సంక్షేమ శాఖ నాయకుడు ప్రభుగౌడ్, మల్లికార్జున్ పాటిల్ హాజరయ్యారు. అలాగే రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం గౌరవ అధ్యక్షుడు సంగమేశ్వర్, రాజేశ్వర్ స్వామి, శివకుమార్, ఈశ్వరప్ప, వీరశైవ లింగాయత్ సమాజం అధ్యక్షుడు ఇప్పపల్లి నరసింహులు, మహిళా అధ్యక్షురాలు, కార్యదర్శులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
