HyderabadEducationSystem | విద్య వ్యాపారంగా మారిన హైదరాబాద్..
HyderabadEducationSystem |విద్య వ్యాపారంగా మారిన హైదరాబాద్..
HyderabadEducationSystem | స్కూల్ ఫీజుల పెరుగుదలతో మధ్యతరగతిపై భారీ భారం
IIT, NEET కోచింగ్ పేరుతో విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి
ర్యాంకుల పోటీతో మానసిక ఆరోగ్యంపై ప్రభావం
ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం అవసరం
ఫీజుల నియంత్రణ, పారదర్శకతపై తల్లిదండ్రుల డిమాండ్
HyderabadEducationSystem | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో విద్య క్రమంగా వ్యాపార రూపం దాల్చుతోందన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. స్కూల్ ఫీజులు పెరుగుదల, కార్పొరేట్ కాలేజీల పోటీ, కోచింగ్ సెంటర్ల ఒత్తిడి కలిసి మధ్యతరగతి కుటుంబాల పై భారీ ఆర్థిక భారం మోపుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతి ఏడాది ఫీజులు పెరుగుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడ్మిషన్ ఫీజులు, యూనిఫాం, పుస్తకాలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కలిపితే ఒక విద్యార్థి పై పడే ఖర్చు భారీగా మారుతోందని వారు చెబుతున్నారు. కొన్ని పాఠశాలల్లో పారదర్శకత లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
HyderabadEducationSystem | విద్యార్ధుల పై ఒత్తడి..

ఇక ఇంటర్ స్థాయిలో కార్పొరేట్ కాలేజీల ప్రభావం మరింత పెరిగింది. IIT, NEET కోచింగ్ పేరుతో విద్యార్థుల పై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోందని తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు క్లాసులు, టెస్టులు, ర్యాంక్ ఒత్తిడితో విద్యార్థుల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కోచింగ్ సెంటర్లలో పోటీ మరింత పెరిగి, ప్రతి సంవత్సరం ఫీజులు లక్షల్లో చేరుతున్నాయి. మంచి ర్యాంక్ వస్తేనే భవిష్యత్తు అన్న భావనతో విద్యార్థులు నిరంతరం ఒత్తిడిలో ఉండాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇది విద్యను అభ్యాసం నుంచి ర్యాంకుల పోటీగా మార్చిందని విమర్శలు వినిపిస్తున్నాయి.
HyderabadEducationSystem | అసలు కారణం ఇదే..

విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కాకపోవడం కూడా ప్రైవేట్ విద్యా వ్యవస్థ పెరుగుదలకు కారణమవుతోంది. తల్లిదండ్రులు నాణ్యమైన విద్య కోసం భారీ ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో విద్య అంటే జ్ఞానం పొందే మార్గం కంటే ఆర్థిక భారంగా మారిన పరిశ్రమగా మారుతోందన్న చర్చ బలపడుతోంది. ప్రభుత్వం ఈ పరిస్థితి పై నియంత్రణ తీసుకుని ఫీజుల నియంత్రణ, పారదర్శకత, విద్యార్థుల మానసిక ఆరోగ్యం పై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అలాగే ప్రభుత్వం కూడా ప్రైవేట్ కాలేజీల ఫీజు దోపిడి నుంచి కాపాడాలని.. ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విద్యార్దుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
