Students | అప్పటి నుండే రెండో విడత పరీక్షలు..

Students | అప్పటి నుండే రెండో విడత పరీక్షలు..

Students | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సీబీఎస్‌ఈ పదో తరగతి రెండో విడత పరీక్షల షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. మే 15 నుంచి మే 21 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

ఈ ఏడాది నుంచి పదో తరగతి పరీక్షలను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విధానంతో విద్యార్థులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని విద్యా వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Reply