దళితుల స్మశానవాటిక భూమిపై కబ్జా యత్నం..
దళితుల స్మశానవాటిక భూమిపై కబ్జా యత్నం..
- హద్దురాళ్లు పాతడాన్ని అడ్డుకున్న నాయకులు..
- అధికారుల జోక్యం కోరుతూ డిమాండ్
కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ తూర్పు శివనగర్ స్మశానవాటికలో దళితులు ఎన్నో సంవత్సరాలుగా తమ కుటుంబ సభ్యుల అంత్యక్రియలు నిర్వహించి సమాధులు ఏర్పాటు చేస్తున్న స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని మాజీ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆదివారంగుర్తుతెలియని వ్యక్తులు ఆ స్థలంలో హద్దురాళ్లు పాతుతూ భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు.
విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక మాజీ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ గారు,కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు రేణుకుంట్ల శివకుమార్ డి హెచ్ పి ఎస్, జిల్లా అధ్యక్షులుసంగి ఏలేందర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు.అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి, స్మశానవాటిక భూమిపై జరుగుతున్న కబ్జా యత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. హద్దురాళ్లు పాతేందుకు ఉపయోగిస్తున్న జెసిబి యంత్రాన్ని అడ్డుకొని, వెంటనే అక్కడి నుంచి పంపించారు. దళితుల స్మశానవాటిక భూమిని కాపాడాలని, ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి భూమిపై అక్రమ ఆక్రమణలను అడ్డుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. దళితుల హక్కులను పరిరక్షించేందుకు చివరి వరకు పోరాడుతామని వారు స్పష్టం చేశారు.దళితుల స్మశానవాటికపై కబ్జా యత్నాలు ఆపాలి ప్రజల హక్కులను కాపాడాలనీ వారు డిమాండ్ చేశారు.
