Mallareddy Schools | విద్యార్థులతో స‌ర‌దాగా క్రికెట్ ఆడి సందడి

Mallareddy Schools | విద్యార్థులతో స‌ర‌దాగా క్రికెట్ ఆడి సందడి

బ్యాట్ పట్టిన మ‌ల్ల‌న్న‌
శామీర్‌పేట్‌లో సీఎంఆర్, మల్లారెడ్డి పాఠశాలల ప్రారంభం
తక్కువ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యమన్న మాజీ మంత్రి

Mallareddy Schools | ఆంధ్రప్రభ, మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గంలోని శామీర్‌పేట్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్, మల్లారెడ్డి పాఠశాలలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ఆయన ఉత్సాహంగా గడిపారు. పాఠశాల ప్రారంభోత్సవం అనంతరం మల్లారెడ్డి విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బ్యాట్ పట్టి షాట్లు ఆడుతూ విద్యార్థులతో సరదాగా మమేకమయ్యారు. ఆయన క్రికెట్ ఆడిన దృశ్యాలు అక్కడున్న వారిని ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు తనను వరుసగా మూడుసార్లు గెలిపించి ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆదరణకు గుర్తుగా ప్రతి మండలంలో తక్కువ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో విద్యా రంగంలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.